కోకా 2.0 మూడో సాంగ్ వచ్చేసింది

కోకా 2.0 మూడో సాంగ్ వచ్చేసింది

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లెటెస్ట్ ఫిల్మ్ ‘లైగర్’కు సంబంధించిన మూడో సాంగ్ వచ్చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుంచి చిత్ర బృందం కొత్త పాటను విడుదల చేసింది. శుక్రవారం సాయత్రం రిలీజైన కోకా 2.0 సాంగ్ లో విజయ్ దేవరకొండ లుక్ ఆకట్టుకుంటోంది. తలపాగ, కుర్తా పైజామాలో అలరించగా.. అనన్య పాండే ట్రెడిషన్ లుక్ లో అదరగొట్టింది. ‘కొనిస్తనే..కొకా..’తో సాంగ్ ప్రారంభమైంది. ఈ సాంగ్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ కొద్దిసేపు కనిపించడం విశేషం. ఆయన కూడా విజయ్ తో స్టెప్స్ వేశారు.

ప్రస్తుతం ఈ సాంగ్ యూత్ ను తెగ ఉపేస్తోంది. సాంగ్ అలా విడుదలైందో లేదో.. వైరల్ గా మారింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు. విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా అనన్య పాండే నటిస్తోంది.  ఈ సినిమాలో మైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి మూవీని నిర్మిస్తున్నారు.