Liger X series scooty: లైగర్కు స్టాండ్ వేయనక్కర్లే..

Liger X series scooty: లైగర్కు స్టాండ్ వేయనక్కర్లే..

ఢిల్లీ ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2023లో పలు కంపెనీలు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా లైగర్ మొబిలిటీ బైక్ కంపెనీ వినూత్న ఆవిష్కరణను ప్రజల ముందు ఉంచింది. ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లో వరల్డ్స్ ఫస్ట్ ఆటో బ్యాలెన్సింగ్ ఫీచర్ కలిగిన లైగర్ ఎక్స్,  లైగర్ ఎక్స్+ వేరియంట్లలో స్కూటీలు లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్కూటీలకు స్టాండ్ వేయాల్సిన అవసరం లేదు. 

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సెన్సర్స్ ఉండటం వల్ల లైగర్ స్కూటీలు ఆటో బ్యాలెన్స్ చేసుకోగలవు. మాటిమాటికి కాళ్లు కిందపెట్టాల్సిన పనిలేదు. ఈ ఫీచర్ ట్రాఫిక్ జామ్, పార్కింగ్ టైంలో ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే, ఆటో బ్యాలెన్సింగ్ ఫీచర్ కేవలం స్కూటీ ఆన్ లో ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఈ మోడల్స్ ను కేవలం ఇండియన్ మార్కెట్ లోనే తీసుకొస్తున్నట్లు లైగర్ కంపెనీ తెలిపింది. ఈ ఏడాది దీపావళికి లైగర్ స్కూటీలు మార్కెట్ లోకి రానున్నాయి. లైగర్ ఎక్స్ స్కూటీని 3 గంటలు ఫుల్ ఛార్జ్ చేసి 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటీ రేటు రూ. 90 వేలుగా నిర్ణయించారు. లైగర్ ఎక్స్+ వేరియంట్ ను నాలుగున్నర గంటలు ఛార్జింగ్ తో 100 కిలోమీటర్లు మైలేజీ ఇచ్చే ఈ స్కూటీ ధర లక్ష.