రష్యాలో రేపు విక్టరీ డే సంబరాలు

రష్యాలో రేపు విక్టరీ డే సంబరాలు

ప్రతి ఏడాది లాగే రష్యా రేపు విక్టరీ డే నిర్వహించుకుంటోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతుండడంతో రేపటి వేడుకలపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయోత్సవ వేడుకల సందర్భంగా యుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. గతేడాది శత్రువులు రష్యాను చుట్టుముట్టారని, పశ్చిమ సిద్ధాంతాలు తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. రేపు ఉక్రెయిన్ యుద్ధంపై కీలకమైన ప్రకటన చేస్తారన్న వాదన వినిపిస్తోంది. మరియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించడంతో పాటు పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించి ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలు ప్రయోగిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. విక్టరీ డే రోజు పుతిన్ ప్రజల్ని రెచ్చగొట్టి, వారితో ఆయధాలు పట్టించే అవకాశాలున్నాయని వెస్ట్రర్న్ కంట్రీస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు విక్టరీ డే సందర్భంగా పుతిన్ మార్షల్ లా ప్రకటిస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చట్టాన్ని ఒకవేళ అమలు చేస్తే రష్యాలో ఎన్నికలు రద్దు అవుతాయి. అధికారాలన్నీ అధ్యక్షుడు పుతిన్ చేతిలోనే ఉంటాయి. 18 ఏళ్లు వయస్సు నిండిన యువకులు అవసరమైతే యుద్ధానికి వెళ్లాలి. ఇటు మరియుపోల్ లో రష్యా దాడులు కొనసాగిస్తోంది. అజోవ్ స్టల్ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోవడానికి ఆ దేశ సైనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. అయితే బంకర్లు, టనెళ్లలో దాక్కున్న ఉక్రెయిన్ సైనికులు రష్యా సేనలను తిప్పికొడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా, యూరోపియిన్ దేశాలు పంపిన ఆయుధాలు, మిలిటరీ ఎక్విప్ మెంట్ ను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. వైమానిక దాడులు చేసి 48 యూనిట్ల వెపన్లు, ఇతర మిలిటరీ ఎక్విప్ మెంట్ తో పాటు 280 మంది ఉక్రెయిన్ జవాన్లను హతమార్చామని ప్రకటించింది. ఉక్రెయిన్ లో సైనిక కార్యకలాపాలను సమన్వయం చేస్తూ అమెరికా తమతో నేరుగా యుద్ధం చేస్తోందంటున్నారు రష్యన్ ప్రజాప్రతినిధులు. 

అత్యున్నత స్థాయి టెక్నాలజీతో రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. డ్రోన్లతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. 3 డీ ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో రష్యన్ ట్యాంకర్లపై వదులుతోంది. కాలం చెల్లిన గ్రానేడ్లకు 3 డీ ప్రింటెడ్ ప్లాస్టిక్ పిన్స్ అటాచ్ చేస్తోంది. డ్రోన్ల సహాయంతో వీటిని సౌండ్ చేయకుండా విడుస్తుండడంతో రష్యన్ సైనికులు గాయపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

నిజామాబాద్​ సీపీ ఆఫీస్​ ముందు ఎంపీ అర్వింద్​ ధర్నా

కొత్త మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు