ప్రేమ, పెళ్లి, విడాకులు..

ప్రేమ, పెళ్లి, విడాకులు..

తండ్రి కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌ తరహాలో శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌ కూడా మల్టీ టాలెంటెడ్. నటిగానే కాక సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మ్యూజిక్ కంపోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, లిరిసిస్ట్‌‌‌‌‌‌‌‌గా బహుముఖ ప్రజ్ఞ చూపిస్తుంది శ్రుతి. ఇప్పటికే పలుమార్లు తన మ్యూజిక్‌‌‌‌‌‌‌‌తో మ్యాజిక్ చేసిన శ్రుతి.. మరోసారి ఓ వీడియో ఆల్బమ్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఇనిమెల్‌‌‌‌‌‌‌‌’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోను సోమవారం లాంచ్ చేశారు. ఈ పాటను శ్రుతి కంపోజ్ చేసి, పాడటంతో పాటుగా నటించింది. ఖైదీ, విక్రమ్ లాంటి చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన లోకేష్ కనగరాజ్‌‌‌‌‌‌‌‌ ఇందులో శ్రుతికి జంటగా నటించడం విశేషం. ఓ డేటింగ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా కలిసిన శ్రుతి, లోకేష్.. ఫస్ట్ డేట్‌‌‌‌‌‌‌‌లో సినిమాకు వెళ్తారు. తెరపై వస్తున్న పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు.

ఇద్దరూ ప్రేమించుకోవడం, రిజిస్టర్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పెళ్లి చేసుకోవడం, వాళ్ల మధ్య రొమాన్స్, ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యి విడాకులకు దారితీస్తుంది. రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లో అలా తాము విడిపోకూడదని ఈ జంట రియలైజ్‌‌‌‌‌‌‌‌ అవడంతో వీడియో ముగుస్తుంది. ప్రేమ, పెళ్లి, విడాకుల నేపథ్యంలో నేటి యువతరం పోకడలను ఈ పాటలో చూపించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ భువన్ గౌడ ఈ పాటకు సినిమాటోగ్రాఫర్.  కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌ లిరిక్స్ రాయడంతో పాటు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దీన్ని ప్రొడ్యూస్ చేశారు.