కోటగిరి మండలంలో రూ.3.5 కోట్లతో లింగమయ్య ఆలయ పునర్నిర్మాణం

కోటగిరి మండలంలో  రూ.3.5 కోట్లతో లింగమయ్య ఆలయ పునర్నిర్మాణం

కోటగిరి, వెలుగు: మండలంలోని అడ్కాస్ పల్లి గ్రామానికి చెందిన ముమ్మలనేని రాజశేఖర్‌ లింగమయ్య ఆలయాన్ని రూ.3.5 కోట్లతో పునర్నిర్మించారు. శనివారం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. 

శనివారం  యాగశాల ప్రవేశం, గోపూజ, గణపతి-గౌరీ పూజ, పుణ్యహవాచనము, గణపతి హోమం నిర్వహించారు. శివానంద శివచార్య మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యాగశాల, మండపాల్లో ఆరాధన కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు బస్వారాజ్ మహారాజ్ సహా 21 మంది వేద పండితులు గణపతి హోమాన్ని నిర్వహించారు. ముమ్మలనేని రాజశేఖర్ దంపతులు కూడా హోమంలో పాల్గొన్నారు. 

ఆధ్యాత్మిక గురూజీ కమ్మ శ్రీ నూరి నారాయణమూర్తి, సాయంత్రం కాశీ ఉప పీఠాధిపతి ప్రవచనాలు చెప్పి భక్తులకు మహా అన్నప్రసాదాన్ని అందించారు.

 కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి దేగం హనుమంతు, ఉపాధ్యక్షుడు సరోజ్ చలపతిరావు, పండిత్ రావు పటేల్, కోశాధికారి హనుమంత్ రావు పటేల్, సభ్యులు వాసు బాబు, సుధీర్ బాబు, బాలాజీ పటేల్ సాయికుమార్ గౌడ్, రమణారెడ్డి, గోపు సాయిలు, పుండలిక్, గంగు పటేల్, ఓలే లక్ష్మీలింగప్ప పటేల్, దేవానంద్ దేస్ ముఖ్, రాధాకృష్ణ పాల్గొన్నారు.