సర్కస్ లో సీన్ రివర్స్ : రింగ్ మాస్టర్ పై సింహం దాడి

సర్కస్ లో సీన్ రివర్స్ : రింగ్ మాస్టర్ పై సింహం దాడి

సర్కస్ లో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓకే. ఒకవేళ సీన్ రివర్సైతే మాత్రం ప్రాణాలే పోతాయి. క్రూర జంతువులతో రకరకాల ఫీట్లు చేయించే ట్రైనర్లకు ఈ విషయం బాగా తెలుసు. తేడా వస్తే వాళ్ల శాల్తీలు గల్లంతు కావడమే కాదు… చూసేవారికి కూడా అపాయమే. అందుకే… ట్రైనర్లు చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. జంతువుల ప్రవర్తనలో సడెన్ గా ఏమైనా మార్పులొచ్చినా వాటిని లొంగదీసుకునే టెక్నిక్ లు తెల్సుకుని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటారు. ఇలాంటి ప్రమాదం నుంచే ఓ రింగ్ మాస్టర్ తన తెలివితో బయటపడ్డాడు.

ఉక్రెయిన్ లో జరిగిన సర్కస్ ఈవెంట్ లో అనుకోని సంఘటన జరిగింది. అక్కడ సింహాలు, పులులు లాంటి క్రూర మృగాలతో సర్కర్ చేయించేందుకు అంతా సిద్ధం చేశారు. నాలుగు సింహాలతో ఫీట్లు వేయించడానికి ట్రైనర్ రెడీ అయ్యాడు. అరుస్తూ… సింహాలను టాస్క్ ఇస్తూ.. ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కొన్ని సింహాలు.. తమకు చెప్పిన ఫీట్లు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. సడెన్ గా ఓ సింహం రూట్ మార్చింది. రింగ్ మాస్టర్ వైపు దూసుకొచ్చింది. తన ముంజేతి గోళ్లతో అతడి తలపై దాడి చేసింది. జబ్బలపైనా రక్కేసింది. మిగతా సింహాలను కూడా పరుగుపెట్టించింది.

వామ్మో… సర్కస్ చూస్తున్న జనం జడుసుకున్నారు. ఐతే… ట్రైనర్ మాత్రం చాలా కేర్ ఫుల్ గా దీనిని డీల్ చేశాడు. మూడ్ దెబ్బతిన్న సింహాన్ని కూల్ చేశాడు. కొద్దిసేపటికి అది దారిలోకొచ్చింది. కోపం తగ్గించుకుంది. వెనక్కి తిరిగి తన బోన్ లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.