లియోనెల్ మెస్సీ 109వ ఇంటర్నేషనల్ గోల్

లియోనెల్ మెస్సీ 109వ ఇంటర్నేషనల్ గోల్

ఈస్ట్ రూథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్డ్ (యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) : లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ 109వ ఇంటర్నేషనల్ గోల్ కొట్టిన వేళ కోపా అమెరికా టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జెంటీనా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. వరుసగా మూడు మేజర్ టైటిళ్లు నెగ్గి స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డును సమం చేసేందుకు మరొక్క విజయం దూరంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో అర్జెంటీనా 2–0తో కెనడాపై  ఘన విజయం సాధించింది.

అర్జెంటీనా 22వ నిమిషంలో తొలి గోల్ చేసింది. రోడ్రిగో డి పాల్ నుంచి లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అద్భుతంగా కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ జులియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్వారెజ్ ఈ గోల్ అందించాడు. 51 నిమిషంలో యింజో ఫెర్నాండెజ్ కొట్టిన షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రత్యర్థి ఆటగాడు ఇస్మాయెల్ కొనె సరిగ్గా బ్యాలెన్స్​ చేయకపోవడంతో నెట్ వద్ద లభించిన బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెస్సీ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఆధిక్యాన్ని 2–0కి పెంచాడు. ఈ టోర్నీలో మెస్సీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం.