బయటి బ్రాండ్ల ఎఫెక్ట్​.. లిక్కర్​ సేల్స్​ డౌన్​

బయటి బ్రాండ్ల ఎఫెక్ట్​.. లిక్కర్​ సేల్స్​ డౌన్​

నల్గొండ, వెలుగు :    ఎన్డీపీ(నాన్​ డ్యూటీ పెయిడ్)  లిక్కర్ కంట్రోల్​ చేయడం రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ కు  సవాల్​గా మారింది.  సేల్స్ పెంచేందుకు ఆఫీసర్లు ఎంత ప్రయత్నించినా  టార్గెట్  చేరుకోలేపోతున్నారు. గడిచిన రెండు, మూడు నెలల నుంచి రాష్ట్రంలో  లిక్కర్​ సేల్స్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సేల్స్ పెంచాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం ధరలను కూడా సవరించింది.  ఏపీలో కంటే తెలంగాణలో వివిధ బ్రాండ్ల మీద రేట్లను రూ.10వరకు తగ్గించింది. అయినప్పటికీ జూన్​లో సేల్స్  ఏమాత్రం పెరగలేదు. ఆఫీసర్లు సేల్స్ పడిపోవడానికి కారణాలను లోతుగా అనలైజ్​ చేశారు.  ఎన్నడూ లేనివిధంగా గత రెండు మూడు నెలల నుంచి ఎన్డీపీ  లిక్కర్ రాష్ట్రంలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

ALSO READ :డస్ట్​బిన్లు​ లేవు..స్వచ్ఛ ఆటోలు రావు​.. గ్రేటర్ సిటీలో కంపు

ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలోని ముంబయి, ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు  ఉన్న  ప్రాంతాల నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఎన్డీపీ లిక్కర్ సప్లై అవుతోంది. హైదరాబాద్​తో సహా  రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో వేడుకలు, దావత్​ల్లో ఎన్డీపీ లిక్కర్ కనిపిస్తోంది. ఫారిన్​ బ్రాండ్లతోపాటు,  దేశీయ లిక్కర్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు.  ఈమధ్య హైదరాబాద్, నల్గొండ, మహబూబ్​నగర్​ జిల్లాలో పట్టుబడ్డ లిక్కర్లో ఎక్కువగా ఫారిన్​ బ్రాండ్లే ఉన్నాయి. ఈ లింక్​ కనిపెట్టేందుకు ఆఫీసర్లు ప్రయత్నించగా, దాని వెనక బడాబాబుల  ప్రమేయం ఉందని తెలిసి వెనకడుగు వేశారు. పెద్ద ఫంక్షన్లు, ఈవెంట్లలో ఫారిన్ బ్రాండ్లే కనిపిస్తున్నాయని స్వయంగా ఎక్సై జ్ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ చెప్పడం సంచలనం రేకెత్తిచింది. కానీ దాన్ని కంట్రోల్ చేసేందుకు మాత్రం ఆఫీసర్లు ధై ర్యం చేయలేకపోతున్నారు.

తనిఖీలు చేసిన ఎన్డీపీ దొరకట్లే..

కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎక్సైజ్ కమిషనర్ ముషారఫ్ అలీ కొద్దిరోజుల కింద జిల్లా ఉన్నతాధికారులతో జరిపిన రివ్యూలో ప్రధానంగా ఎన్డీపీ లిక్కర్ గురించే ప్రస్తావించారు.  సేల్స్ పెంచాలని ఎస్ఐ, సీఐల మీద ఎంత ఒత్తిడి పెంచినా ఎలాంటి లాభం ఉండట్లేదు.  దీంతో ఎన్డీపీ లిక్కర్​పై  ఫోకస్ పెట్టాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.  నేషనల్, స్టేట్​ హైవేలపై ఉన్న టోల్​గేట్లు, చెక్​పోస్టుల వద్ద ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​ టీమ్​లు నిఘా పెంచాయి. కా నీ ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఎన్డీపీ లిక్కర్ పట్టుకున్న కేసులు నమోదు కాలేదు. ఎయిర్​పోర్టులు, పెద్ద కంటైనర్లు,  కొరియర్ల ద్వారానే ఎన్డీపీ లిక్కర్ సప్లై అవుతున్నట్టు హైదరాబాద్​కు చెందిన ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో  చెప్పారు.

 దీన్ని కనిపెట్టడం ఒక్క ఎక్సైజ్ శాఖ వల్ల కాదని,  ఇతర పోలీస్,  నిఘా సంస్థలు సహకరిస్తే తప్ప సాధ్యం కాదని ఆయన చెప్పారు. పైగా గత ఆరేళ్ల నుంచి బదిలీల లేకపోవడంతో ఎస్, సీఐలు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. పైరవీలు చేసుకున్న వారికే మం చి పోస్టింగ్లు దక్కుతున్నాయి. దీనివల్ల సేల్స్ పెంచడం పైన ఎస్హెచ్ఓ లు శ్రద్ధ చూపించట్లేదు. 

భారీగా తగ్గిన లిక్కర్ సేల్స్..

రాష్ట్రంలోని 2,618 వైన్స్ షాపుల్లో లిక్కర్ సేల్స్​తో పోలిస్తే బీర్ల సేల్స్ భారీగా పెరిగాయి. లిక్కర్​లో ఆర్డనరీ బ్రాండ్లకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది.  కాస్ట్​లీ ప్రీమియం బ్రాండ్ల జోలికి పోవట్లేదు.  నిరుడు జూన్​లో లిక్కర్ 29, 14,163 కాటన్లు అమ్ముడుకాగా,  బీర్లు 49,11,689 కాటన్లు సేల్ అయ్యాయి. ఈ ఏడాది జూన్​లో లిక్కర్ 30, 06,149 కాటన్లు అమ్ముడుకాగా, బీర్లు 58,87,859 కాటన్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా నిరుడు జూన్​లో రూ.302 కోట్ల ఇన్​కం వస్తే ఈ ఏడాది రూ.317 కోట్లు వచ్చింది. అంటే నిరుటితో పోలిస్తే కేవలం రూ.15 కోట్లు మాత్రమే పెరిగింది. 

3.15 శాతమే పెరిగిన  లిక్కర్ సేల్..

సర్కార్ టార్గెట్ మేరకు గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా జరిగే సేల్స్ 15శా తం పెరగాలి.  అలాగే జిల్లా కేంద్రాల్లో నడిచే షాపుల్లో 20శాతం, మెట్రోసీటీల్లో నడిచే షాపుల్లో 30శాతం సేల్స్ పెరగాలి.  అన్నీ కలిపి సగటున 20 శా తం సేల్  పెంచాలి. కానీ నిరుడు జూన్​లో జరిగిన సేల్స్​తో పోలిస్తే ఈ ఏడాది జూన్​లో లిక్కర్  సేల్స్​ కేవలం 3.15 శాతం మాత్రమే పెరిగాయి. అదే బీర్ల విషయానికొస్తే 19.8శాతం పెరిగాయి.  నిరుడు జూన్​తో పోలిస్తే ఈ ఏడాది జూన్​లో లిక్కర్ సేల్ కేవలం 91,986 కాటన్లు పెరిగితే.. బీర్లు 9,76,170 కాటన్లు పెరిగాయి. ఎక్సైజ్ లెక్కల ప్రకారం లిక్కర్ సేల్స్ పైన ట్యాక్సీలు ఎక్కు వగా ఉంటాయి. కాబట్టి సర్కార్​కు వచ్చే ఆదాయంలో మెజార్టీ వాటా లిక్కర్ నుంచి వస్తోంది.