లాక్ డౌన్ లో లిక్క‌ర్ సేల్స్ రికార్డ్: ఒక్క రోజులోనే రూ.45 కోట్లు

లాక్ డౌన్ లో లిక్క‌ర్ సేల్స్ రికార్డ్: ఒక్క రోజులోనే రూ.45 కోట్లు

దేశంలో క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దాదాపు 40 రోజుల పైగా లాక్ డౌన్ అమ‌ల‌వుతోంది. మార్చి 24 త‌ర్వాత‌ స్కూళ్లు, కాలేజీల‌తో పాటు మాల్స్, థియేట‌ర్లు, లిక్క‌ర్ షాపులు ఇలా అన్నీ మూత‌ప‌డ్డాయి. దీంతో మ‌ద్యం ప్రియులు లిక్క‌ర్ దొర‌క్క‌పోవ‌డంతో విత్ డ్రాయ‌ల్ సిప్ట‌మ్స్ తో ఆస్ప‌త్రుల పాలైన ఘ‌ట‌న‌లు కూడా జ‌రిగాయి. అయితే రెండ్రోజుల క్రితం లాక్ డౌన్ ను మే 17 వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులిచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌లో అనేక స‌డ‌లింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా లిక్క‌ర్ షాపులు కూడా ఓపెన్ చేసేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

దీంతో ప‌లు రాష్ట్రాలు క‌రోనా కేసులు త‌క్కువ‌గా ఉన్న ఏరియాల్లో మ‌ద్యం సేల్స్ కు అనుమ‌తి ఇచ్చాయి. దాదాపు 40 రోజుల త‌ర్వాత సోమ‌వారం షాపులు తెరుచుకోవ‌డంతో వంద‌లాది మంది ఒకేసారి లిక్క‌ర్ షాపుల‌కు క్యూలు క‌ట్టారు. దీంతో అనేక రాష్ట్రాల్లో భారీగా లిక్క‌ర్ సేల్స్ జ‌రిగాయి. క‌ర్ణాట‌క‌లో సోమ‌వారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.45 కోట్ల మేర మ‌ద్యం అమ్ముడైంద‌ని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్ల‌డించింది.