
యాదాద్రి, వెలుగు: వరుసగా సెలవులు, దసరా పండుగ నేపథ్యంలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క సెప్టెంబర్లోనే రూ.80 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగగా, చివరి నాలుగైదు రోజుల్లోనే రూ.40 కోట్ల విక్రయాలు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం దండిగా వచ్చింది.
రెండేండ్ల కంటే ఎక్కువగా..
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఎక్సైజ్ సర్కిల్లో 82 వైన్స్‌లు, 12 బార్లు ఉన్నాయి. ఈ దసరా సమయంలోనూ 2023, 2024 కంటే ఈసారి లిక్కర్ సేల్స్గణనీయంగా పెరిగింది. 2023 దసరా సీజన్లో రూ.26 కోట్ల లిక్కర్ అమ్ముడుపోగా, 2024లో రూ.38 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగింది. ఈసారి సెప్టెంబర్ 28 వరకూ రూ.80 కోట్ల విలువైన లిక్కర్‌ను వైన్స్, బార్లు లిఫ్ట్ చేశారు. ఇందులో చివరి నాలుగైదు రోజుల్లోనే రూ.40 కోట్లకు మించి లిక్కర్ అమ్మడు పోయిందని తెలుస్తోంది.