
మరో వారం రోజుల్లో దీపావళి రాబోతోంది. దసరాతో స్టార్ట్ అయిన పండుగల సీజన్ షాపింగ్ హడావిడి దీపావళి వరకు కొనసాగనుంది. ఈ కాలంలో భారతీయులు కొత్త కార్ కొనుగోలు వైపు అడుగులు వేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ఖర్చులతో.. మైలేజి ఇప్పుడు ప్రధాన అంశంగా వాహనదారులు భావిస్తున్నారు. పండక్కి రూ.10 లక్షలలోపు బడ్జెట్లో ఫ్యూయెల్ ఎఫీషియెంట్ మోడళ్ల కోసం వెతుకున్న వారి కోసం పూర్తి వివరాలు ఇవే..
మారుతీ సుజుకీ సెలెరియో:
కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సెలెరియో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ కారు LXi MT వేరియంట్ రూ.4లక్షల 69వేల 900కే ప్రారంభమౌతోంది. దీని మైలేజి పెట్రోల్ వెరియంట్‌లో లీటరుకు 26.6 కిమీ , CNG వెరియంట్‌లో కేజీకి 35.12 కిమీగా ఉంది . వాస్తవ వినియోగంలో 22–24 కిమీ పెట్రోల్ వేరియెంట్, 30–32 కిమీCNG వేరియెంట్ అందిస్తుంది.
మారుతీ సుజుకీ వెగన్ ఆర్:
ఇక అర్బమ్ మెుబిలిటీలో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ సుజుకీ వెగన్ ఆర్. LXi MT వెరియంట్ రూ.4లక్షల 98వేల 900 నుంచి ప్రారంభమవుతుంది. లీటరుకు 26.1 కిమీ మైలేజితో వెగన్ ఆర్ విశాలమైన ఇంటీరియర్, కాంపాక్ట్ డిజైన్ కారణంగా సిటీ డ్రైవింగ్‌కు సరిపోతుంది.
మారుతీ సుజుకీ ఆల్టో K10:
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైలేజి కోరుకునే ఫస్ట్ టైమ్ కార్ బయ్యర్లకు ఆల్టో K10 సరైన ఎంపికని చెప్పుకోవచ్చు. దీని ప్రారంభ వేరియంట్ రేటు రూ.3లక్షల 69వేల 900గా ఉంది. ఇది గరిష్టంగా లీటరుకు 24.8 కిమీ మైలేజి ఇస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్‌గా నిలిచింది.
మారుతీ సుజుకీ స్విఫ్ట్:
ఆకర్షణీయమైన డిజైన్, సౌకర్యం, మైలేజి కలిగిన బెస్ట్ బడ్జెట్ కారు స్విఫ్ట్. VXi వెరియంట్ ధర రూ.7లక్షల 70వేల 900 నుంచి లభిస్తుంది. ఇది లీటరుకు 23.2 కిమీ మైలేజి ఆఫర్ చేస్తోంది. పెద్ద హ్యాచ్‌బ్యాక్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.
మారుతీ సుజుకీ డిజైర్:
సెడాన్ ప్రేమికుల కోసం డిజైర్ ఒక ఉత్తమ ఎంపిక. LXi MT వెరియంట్ రూ.6లక్షల 25వేల 600కి లభిస్తుంది. ఇది లీటరుకు 24.1కిమీ మైలేజితో సిటీ డ్రైవింగ్, హైవే ప్రయాణాలకు రెండింటికీ బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.
ALSO READ : బీరు ప్రియులకు చేదు వార్త.. ఇక ఈ బీరు దొరుకుడు కష్టమే..
హ్యుందాయ్ ఎక్స్టర్:
కాంపాక్ట్ SUVలలో కొత్తగా చేరిన ఎక్స్టర్, యువతను ఎంతో ఆకర్షిస్తోంది. బేస్ వెరియంట్ రేటు రూ.5లక్షల 68వేల 033 నుంచి స్టార్ట్ అవుతోంది. దీని మైలేజి లీటరుకు 19 కిమీ గా ఉంది. అలాగే కారులో బెస్ట్ డ్రైవింగ్ పొజిషన్ ఉండటం చాలా మందిని ఆకట్టుకుంటోంది.
టాటా పంచ్:
ఇక చివరిగా కాంపాక్ట్ SUV విభాగంలో మరో ప్రాధాన్య మోడల్ టాటాలకు చెందిన పంచ్ కారుది. XE వెరియంట్ సుమారు రూ.6 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇది గరిష్టంగా లీటరుకు18 కిమీ మైలేజి ఆఫర్ చేస్తోంది. బలమైన డిజైన్, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలతతో చిన్న కుటుంబాలకు ఆప్షన్‌గా ఈ కారు నిలిచింది. ఇక లేటు చేయకుండా దీపావళి షాపింగ్ చేసేముందు బెస్ట్ మెలేజ్ వేరియంట్లపై కూడా ఓ లుక్కేయండి. నచ్చిన కారుతో ఇంటికెళ్లండి.