ఫార్చూన్​500లోకి ఎల్​ఐసీ

ఫార్చూన్​500లోకి ఎల్​ఐసీ

ముంబై : ఇటీవలే స్టాక్​ మార్కెట్లో లిస్టయిన్​ లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) తాజాగా ఫార్చూన్​ గ్లోబల్​ 500 లిస్టులో ప్లేస్​ పొందింది. మరోవైపు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ 51 ప్లేస్​లు ముందుకు జంప్ చేసి 104 కి చేరింది. 97.26 బిలియన్​ డాలర్ల రెవెన్యూ ఉన్న ఎల్​ఐసీ ఈ లిస్టులో 98 వ ప్లేస్​లో నిలిచింది. లిస్టెడ్​ కంపెనీలకు మాత్రమే ఈ ర్యాంకింగ్స్​ ఇస్తారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఈ జాబితాలో గత 19 ఏళ్లుగా కొనసాగుతుండగా, ఎల్​ఐసీ ఈ ఏడాదే చేరింది.

ఫార్చూన్​ గ్లోబల్​ 500 జాబితాలో వాల్​మార్ట్​ మొదటి ప్లేస్​లో నిలవగా, మొత్తం తొమ్మిది ఇండియన్​ కంపెనీలకు ప్లేస్​ దక్కింది. ఈ తొమ్మిదింటిలో అయిదు ప్రభుత్వ రంగ సంస్థలు కాగా, మిగిలిన నాలుగు ప్రైవేటు రంగ సంస్థలు. ఇటీవలే లిస్టింగ్​ పొందిన ఎల్​ఐసీ మాత్రమే మన దేశపు కంపెనీలలో రిలయన్స్​ కంటే ముందు ప్లేస్​లో నిలిచింది. ఐఓసీ, ఓఎన్​జీసీ, టాటా మోటార్స్​, టాటా స్టీల్​, రాజేష్​ ఎక్స్​పోర్ట్స్​, ఎస్​బీఐ, బీపీసీఎల్‌ కూడా ఈ లిస్టులో ప్లేస్ దక్కించుకున్నాయి.