338కు చేరిన లీటర్ పెట్రోల్ ధర  

338కు చేరిన లీటర్ పెట్రోల్ ధర  

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల జీవనం దయనీయంగా మారుతోంది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న శ్రీలంక పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ప్రభుత్వ ఆధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటర్ పెట్రోల్ ధరను దాదాపు శ్రీలంక కరెన్సీలో 84 రూపాయల మేర పెంచింది. దీంతో 92 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర ఎల్కేఆర్ 338కి, 95 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర రూ. 95 మేర పెరిగి రూ. 373కు చేరింది. సూపర్ డీజిల్ లీటర్ ధర రూ.75 పెరిగి రూ.329కి చేరుకోగా.. ఆటో డీజిల్ లీటర్ ధర రూ.113 పెరిగి రూ. 289కి చేరింది. 

ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేటు పెరగడం, డాలర్ తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ క్షీణించడం పెట్రో ధరల పెంపుకు కారణమని అధికారులు చెబుతున్నారు. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ధరలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ రేట్లతో దాదాపు సమానంగా ఉన్నాయి. సీపీసీ ఇంధన ధరలు పెంచడం ఈ నెలలో రెండోసారి కాగా.. ఎల్ఐఓసీ కూడా సోమవారమే రేట్లు పెంచింది. పెరిగిన పెట్రో ధరలు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన లంక ప్రజలకు మరింత భారంగా మారింది. 

మరిన్ని వార్తల కోసం..

ఇష్టం లేని పెళ్లి.. వరుడి చెంప పగలగొట్టిన వధువు.. 

ఫిన్లాండ్ ప్రతినిధుల బృందంతో నీతి ఆయోగ్ సమావేశం