మొహంపై 90 కుట్లు : ప్రాణాల‌కు తెగించి..కుక్క నుంచి త‌న చెల్లిన కాపాడిన ఆరేళ్ల బాలుడు

మొహంపై 90 కుట్లు : ప్రాణాల‌కు తెగించి..కుక్క నుంచి త‌న చెల్లిన కాపాడిన ఆరేళ్ల బాలుడు

ఏజ్ జ‌స్ట్ నెంబ‌ర్ మాత్రమేనని నిరూపించాడు ఆరేళ్ల బాలుడు. ప్రాణాల‌కు తెగించి కుక్క నుంచి త‌న‌చెల్లిని కాపాడి అంద‌రితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ప్ర‌కారం.. అమెరికాకు చెందిన ఆరేళ్ల బాలుడు బ్రిడ్జ‌ర్ వాకర్ త‌న చెల్లిని కాపాడేందుకు కుక్క‌పై దాడికి దిగాడు . ఈ దాడిలో కుక్క‌నుంచి త‌న చెల్లిని కాపాడుకునేందుకు చిన్న‌పిల్ల‌లు చేయ‌లేని సాహ‌స‌మే చేశాడు. కుక్క మొహం పై దాడి చేస్తున్నా ప్రాణాల‌కు తెగించి త‌న చెల్లిని కాపాడుకున్నాడు. త‌న చెల్లిని కాపాడుకునేందుకు కుక్క‌పైకి ఎదురుదాడికి దిగాడు. ఈ విరోచిత పోరాటంలో బాలుడి మొహంపై 90కుట్లు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వాకర్ ఆస్ప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడ‌ని, ఆరోగ్యంగా ఉన్నాడ‌ని త‌ల్లిదండ్రులు తెలిపారు.
ఈ సంద‌ర్భంగా బాలుడి అత్త నిక్కి వాక్ మాట్లాడుతూ ..ఎవ‌రైనా చనిపోవాల్సి వ‌స్తే అది నేనే అయి ఉండాల‌ని అనుకున్నాను. కానీ నా అల్లుడు బ్రిడ్జ‌ర్ కుక్క నుంచి త‌న చెల్లిని కాపాడి హీరో అయ్యాడు అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. బ్రిడ్జ‌ర్ ధైర్య సాహ‌సాల్ని మీరు గుర్తిస్తార‌ని ఆశిస్తున్నానంటూ క్రిస్ హేమ్స్‌వర్త్, రాబర్ట్ డౌనీ జూనియర్, మార్క్ రుఫలో, విన్ డీజిల్ తో పాటు ప‌లువురు హీరోల‌కు బ్రిడ్జ‌ర్ ఫోటోల్ని షేర్ చేసింది. నిక్కి వాక్ షేర్ చేసిన ఫోటోల‌పై హల్క్ , మార్క్ రుఫలు స్పందించారు. ప్రియమైన బ్రిడ్జర్ నువ్వు చేసిన సాహ‌సం గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. ఇతరుల శ్రేయస్సు గురించి ఆలో చించే వ్య‌క్తులు నాకు హీరోలు. నేను మీ ధైర్యాన్ని, సాహసాల్ని గౌర‌విస్తున్నాను.
ధైర్యం అంటే ప్ర‌జ‌ల మీద పెత్త‌నం చెలాయించ‌డం కాదు. మీకు బాధ‌క‌లిగిన‌ప్పుడు కూడా ప్ర‌జ‌ల కోసం ఆలోచించ‌డం దైర్య వంతుడి ల‌క్ష‌ణం అంటూ మ‌రో హీరో స్పందించారు. ప్ర‌స్తుతం బాలుడి తెగువ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

Have y’all noticed that I have no idea what I’m doing yet? #UmmmIAccidentallyWentViral? When I first posted for Bridger, I expected maybe 500 likes at most and maybe a couple dozen reshares. But here we are. So much love from all walks of life (including a few celebs)! And we just got off a call with a friendly neighborhood idol. (Pic is of Bridger’s reaction right after the call.) Bridger is over the moon! Can’t wait to show him what’s next: a message from some guy who doesn’t like bullies. Gotta wait for the stardust to clear from his eyes first, though. Mission accomplished, everyone! We can’t thank you enough. #BridgerStrong EDIT: I feel like I should also mention that Bridger has also loved all of the other videos and messages I’ve shown him from all of you. We might not be able to get to everyone right away, but your messages are no less appreciated.

A post shared by Nikki Walker (@nicolenoelwalker) on