శ్రద్ధ తరహాలో.. ఢిల్లీలో మరో మహిళ హత్య

శ్రద్ధ తరహాలో.. ఢిల్లీలో మరో మహిళ హత్య
  • శ్రద్ధ తరహాలో.. ఢిల్లీలో మరో మహిళ హత్య
  • తనతో రిలేషన్​ షిప్ వదిలించుకునే ప్రయత్నంలో దారుణం
  • డెడ్​బాడీని ముక్కలుగా కట్ చేసే యత్నం
  • పంజాబ్​లో నిందితుడి అరెస్ట్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్​ హత్య తరహాలో ఢిల్లీలో మరో ఘోరం చోటుచేసుకుంది. లివ్​ ఇన్ రిలేషన్​షిప్​లో ఉన్న ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు ఆమె పార్ట్​నర్. ఆమెను ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించాడు. అఫ్తాబ్​పూనావాలాను చూసి ఇన్​స్పైర్​అయి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ దారుణం జరగ్గా శనివారం నిందితుడిని పంజాబ్​లో అరెస్ట్ చేశారు. రేఖారాణి(35) తన 16 ఏండ్ల కూతురుతో కలిసి పశ్చిమ ఢిల్లీలో ఉంటున్నారు. పంజాబ్​కు చెందిన మన్​ప్రీత్ అనే వ్యక్తితో 2015లో ఆమెకు లివ్​ఇన్​ రిలేషన్​షిప్ ఏర్పడింది. అప్పటి నుంచి వీరు గణేశ్​నగర్​లో ఓ అద్దెకుంటున్నారు. అయితే అతనికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల తర్వత రేఖారాణి తనను ట్రాప్ చేసి లివ్​ఇన్​రిలేషన్ షిప్​లోకి లాగిందని అనుమానం పెంచుకున్నాడు. 

అప్పటి నుంచి వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమెను చంపేసి రిలేషన్​ను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. డిసెంబర్​1న రాత్రి రేఖ కూతురుకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. బాలిక పడుకోగానే రేఖను కత్తితో మెడ, దవడ, కడుపులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తర్వాత ఆమె తలను శరీరం నుంచి వేరు చేయాలని ప్రయత్నించాడు. కాని ఆమె కూతురు తనను లేచి పట్టుకుంటుందని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక పొద్దున లేచిన తర్వాత తల్లి మృతదేహాన్ని చూసి పోలీసులకు కాల్ చేసింది. కేసు నమోదు చేసుకున్న తిలక్​నగర్ ​పోలీసులు మన్​ప్రీత్​ను శనివారం పంజాబ్​లో అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఇదివరకే పలు కిడ్నాప్, మర్డర్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.