పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా 5 నిమిషాల్లో లోన్!

పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా 5 నిమిషాల్లో లోన్!

ఓసీఈఎన్ విధానం పరిశీలిస్తున్న బ్యాంకులు

బిజినెస్ డెస్క్, వెలుగు: అన్ని రాష్ట్రాల్లోనూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పేటీఎంతో పాటు అమెజాన్, గూగుల్, ఫోన్ పే వంటి కంపెనీలన్నీ ఈ సెగ్మెంట్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు యూపీఐ విధానాన్ని డబ్బు చెల్లించేందుకు, తీసుకునేందుకు, బిల్స్ చెల్లించడం వంటి పనులకు వాడుకుంటున్నారు. ఇక నుంచి యూపీఐ ద్వారా లోన్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ కేవలం ఐదు నిమిషాల్లోనే! ఇందుకోసం బెంగళూరుకు చెందిన ఐస్పిరిట్ ఫౌండేషన్ ‘ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్ వర్క్(ఓసీఈఎన్‌)’ను రూపొందించింది. దీనివల్ల చిన్న బిజినెస్లకు తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వొచ్చని ఇన్పోసిస్ కో–ఫౌండర్ నందన్ నీలేకనీ అన్నారు. ‘‘ బ్యాంకులు, ఇతర లెండర్ల దగ్గర తగినంత డబ్బు ఉంది కానీ వడ్డీలు, ప్రాసెసింగ్ చార్జీల వంటి ఖర్చుల కారణంగా బారోవర్స్ పై భారం ఎక్కువ అవుతోంది. అప్పు తీసుకునేవాళ్ల డేటా కూడా పూర్తిగా దొరకడం లేదు. అందుకే లోన్ల సంఖ్య తక్కువ ఉంటున్నది. ఓసీఈఎన్ ప్రొటోకాల్ ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఒక మార్కెట్ ప్లేస్ మాత్రమే”అని ఆయన వివరించారు.

ఓసీఈఎన్ అంటేఏంటి?
లోన్లు ఇచ్చే లెండర్లను, మార్కెట్ ప్లేస్ లను, కస్టమర్లను ఓసీఈఎన్ కలుపుతుంది. దీనిని క్రెడిట్ రైల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రొటోకాల్ ద్వారా చిన్న బిజినెస్లు లోన్ కు అప్లై చేసుకోవడం వీలవుతుంది. కేవలం ఐదు నిమిషాల్లో లోన్ ఇవ్వొచ్చు. మనుషులతో అవసరం లేకుండానే లోన్ అప్లికేషన్లు (ఎలాంటి ఖర్చూ లేకుండానే) ప్రాసెస్ అవుతాయి. ఫలితంగా లెండర్ తక్కువ వడ్డీకే అప్పు ఇవ్వవచ్చు. యూపీఐ విధానంలో లోన్ల కోసం స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ తో చర్చిస్తున్నామని ఐస్పిరిట్ తెలియజేసింది.

ఇది ఎలాపనిచేస్తుందంటే..
కస్టమర్ ఆన్ లైన్లో లోన్ కు అప్లై చేసుకోగానే అది ఓసీఈఎన్ సిస్టమ్ ద్వారా బ్యాంకుకు వెళ్తుంది. లెండర్/ఇతర ఏజెన్సీలు తన డాక్యుమెంట్లను పరిశీలించడానికి కస్టమర్ పర్మిషన్ ఇవ్వాలి. జీఎస్టీ నెట్వర్క్, యూఐడీఏఐ వంటివి కూడా అప్లికేషన్లను తనిఖీ చేస్తాయి. ఈ సిస్టమ్ ద్వారా కస్టమర్ల క్యాష్ ఫ్లో స్టేట్ మెంట్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లు లెండర్లకు అందుతాయి. జీఎస్టీఎన్ ఇచ్చే డేటాతో కస్టమర్ ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు రావొచ్చు. ఆ వివరాలతో లోన్ జారీపై లెండర్ నిర్ణయానికి వస్తాడు. ఓసీఈఎన్ విధానం అందుబాటులోకి వస్తే మరింత మందికి, తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయని బ్యాంక్ బజార్ సీఈఓ అదిల్ షెట్టి అన్నారు. ఓఈసీఎన్ ద్వారా ఆన్ లైన్లో లోన్లు ఇచ్చే విధానాన్ని చాలా బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. జీఎస్టీఎన్, యూఐడీఏఐ, కేవైసీలను ఇంటిగ్రేట్ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నాయి.

For More News..

గ్రీన్ కార్డ్ కోసం ఓ వ్యక్తి 195 ఏండ్ల వెయిటింగ్ లిస్ట్!

చైనా మార్స్  ప్రోబ్ ప్రయోగం సక్సెస్

ఇక నుంచి ఆర్మీలో మహిళలకు కీలక బాధ్యతలు