రూ.25వేల వరకూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ

రూ.25వేల వరకూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ

బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు రూ.25వేల వరకూ రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. 25 వేల రూపాయల లోపు ఉన్న రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది ఉన్నారని తెలిపారు. వారందరి రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫాలో మాఫీ చేస్తామన్నారు. ఈ నెలలోనే 25 వేల రూపాయల లోపున్న రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం 1,198 కోట్లను విడుదల చేస్తుందన్నారు. ఈ రుణమాఫీ మొత్తాలను ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో స్థానిక  ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. లక్షలోపు ఉన్న రైతుల రుణాల మొత్తం 24,738 కోట్ల రూపాయలున్నాయి. వీటిని ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు చేతుల మీదుగా..నాలుగు విడుతలుగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు ఈ ఏడాది రుణమాఫీ కోసం 6,225 కోట్ల రూపాయలు ప్రతిపాధించిందన్నారు.

కందుల కొనుగోలు విషయంలో వెనుకాడేది లేదనీ, ఎంతఖర్చైనా కొనుగోలు చేస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు.