
- స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల వివరాలు ప్రకటించిన కలెక్టర్లు
- ఉమ్మడి జిల్లాలో మొత్తం 73 మండలాలు
- మహిళలకు ఎంపీపీ, జడ్పీటీసీ సీట్లు 33
- జనరల్ కోటాలో 40 స్థానాలు
నల్గొండ,యాదాద్రి వెలుగు: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి జిల్లా కలెక్ట ర్లు రిజర్వేషన్ల వివరాలను శనివారం ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి కావడంతో ఉత్కంఠకు తెరపడింది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ శుక్రవారం జీవో విడుదల చేయడంతో రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
బీసీలకు 42శాతం కేటాయించాల్సిన రిజర్వేషన్ల ఆధారంగా నల్గొండ జిల్లాలో 33 మండలాల జడ్పీటీసీ, ఎంపీపీ, 869 జీపీలు, 353 ఎంపీటీసీ, 7,494 వార్డుల సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయగా సూర్యాపేట జిల్లాలో 23 మండలాల జడ్పీటీసీ, ఎంపీపీ, 235 ఎంపీటీసీ, 486 గ్రామ పంచాయతీల సర్పంచ్, 4388 వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. నల్గొండ, సూర్యాపేట కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్‌నంద్‌లాల్‌పవార్‌సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్, ఆర్డీవోల సమక్షంలో ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేషన్లను ఖరారు చేశారు.
అలాగే 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ల్లో కలిపి మహిళలకు 50శాతం రిజర్వేషన్‌తగ్గకుండా ఆయా మండలాల్లో రిజర్వేషన్‌లు చేశారు. గత మూడు నాలుగు రోజులుగా కలెక్టర్‌ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో, డీపీవో, ఆర్డీవోలు, ఇతర జిల్లా అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు.
జిల్లాల్లో రిజర్వేషన్లు ఇలా..
నల్లగొండ జిల్లాలో మొత్తం 33 మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీలకు కలిపి రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. మహిళల కోటాలో 16 మండలాల్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 2, బీసీలకు 7, జనరల్ మహిళల కోటాలో 4 మండలాలు రిజర్వు చే శారు.సూర్యాపేట జిల్లాలో మొత్తం 23 మండలాల్లో మహిళల కోటాలో 10 మండలాలు రిజర్వు చేయగా, వాటిల్లో ఎస్టీలకు 1, ఎస్సీలకు 2, బీసీలకు 5, జనరల్ మహిళలకు 2 కేటాయించారు.
మిగతా 13 మండలాల్లో జనరల్ కేటగిరిలో ఎస్టీలకు 2, ఎస్సీలకు 3, బీసీలకు 5, జనరల్‌కు 3 మండలాలు రిజర్వు చేశారు.యాదాద్రిలో జిల్లాలో ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది. ఎంపీటీసీల్లో మహిళలకు 79 కేటాయించారు. సర్పంచ్‌ల రిజర్వేషన్లు భువనగిరి డివిజన్లో ముగిశాయి. 135 సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
జిల్లా పరిషత్..రెండు బీసీ.. ఒకటి ఎస్టీ
ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలకు రెండు కేటాయించగా, ఎస్టీకి ఒకటి కేటాయించారు. శనివారం రాత్రి గెజిట్ విడుదలైంది. నల్గొండ జడ్పీ ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. యాదాద్రి జడ్పీ బీసీ మహిళకు కేటాయించగా, సూర్యాపేట బీసీ జనరల్‌కు కేటాయించారు.