కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

 కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా: కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించగా..స్థానికులు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారించడంతో రోడ్డపై బైఠాయించి నిరసన తెలియజేశారు. 

ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి లేదని ఆరోపించారు. స్థానిక ప్రజలు ఎవరూ లేకున్నా ఏకపక్షంగా ప్రజాభిప్రాయం ఎలా సేకరిస్తారు..? ఏమని సేకరిస్తారని..? నిలదీశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు.