ప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించాడని మహిళ ఆత్మహత్యాయత్నం

ప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించాడని మహిళ ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ముందు గతంలో స్కావెంజర్ గా పని చేసిన సుజాత అనే మహిళ నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మూడు నెలల క్రితం ఎటువంటి కారణం లేకుండా ప్రిన్సిపాల్ తనను విధుల్లోంచి తొలగించాడని మనస్థాపం చెందిన ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని సూసైడ్ కు యత్నించింది. ఈ ఘటనలో  మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపాల్ గంగారాం తన సొంత పనులు చేయించుకోవడమే కాకుండా వేధింపులకు గురి చేశాడని మహిళ ఆరోపిస్తుంది.

గత మూడు నెలల క్రితం హాస్టల్ లో నీటి సమస్య ఏర్పడిందని..బాత్రూమ్ లు కడగడానికి నీళ్లు లేవని చెప్పినందుకు తనను విధుల్లోంచి తొలగించాడని చెబుతోంది. ఆ తర్వాత విధుల్లోకి తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా తనను తీసుకోకపోవడంతో చేసేది లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సుజాతను విధుల్లోకి తీసుకోకుండా వేధించిన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి సదరు మహిళను విధుల్లోకి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.