
- పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
- దర్యాప్తు చేపట్టిన సెక్యూరిటీ ఏజెన్సీలు
జమ్మూ: జమ్మూకాశ్మీర్ లోని ఇంటర్నేషల్ బార్డర్ వెంబడి గూఢచర్యం కోసం పాకిస్తాన్ పంపిన పావురాన్ని పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కోడ్ మెసేజ్ మోసుకొస్తున్న పావురాన్ని హీరానగర్ సెక్టార్ లోని మన్యారి గ్రామ ప్రజలు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోడ్ ను డీకోడ్ చేసేందుకు సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ‘గ్రామస్తులు పావురాన్ని లోకల్ పోలీసు స్టేషన్ లో అప్పగించారు. దాని కాలికి ఓ రింగ్ ఉంది. దానిపై నంబర్లు ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్నాం’అని కథువా ఎస్పీ శైలేంద్ర మిశ్రా చెప్పారు.