
కామారెడ్డి జిల్లా: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. పాత రాజంపేట జాతీయ రహదారిపై ఓ ఆటో వెళ్తుండగా ..ఆటోను ఓ యువకుడు అడ్డగించాడు. ఆటోలో ప్రయాణిస్తున్న యువతి ఫొటోలను చిత్రీకరించాడు. అతడి చర్యలను గమనించిన స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. తర్వాత యువకుడికి దేహశుద్ధి చేశారు. యువకుడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు అప్పగించారు.