ఆమె దేశ ప్రధాని.. అయినా రెస్టారెంట్ లో సీటు కోసం వెయిటింగ్ తప్పలేదు

ఆమె దేశ ప్రధాని..  అయినా రెస్టారెంట్ లో సీటు కోసం వెయిటింగ్ తప్పలేదు

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ లో లాక్ డౌన్ రూల్స్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. దేశ ప్రధాని అయినా వీటి నుంచి మినహాయింపు లేదు. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా అర్డెర్న్, ఆమె ప్రియుడు క్లార్క్ గేఫోర్డ్ శనివారం ఉదయం వెల్లింగ్టన్ లోని ఆలివ్ రెస్టారెంట్ కు వెళ్లారు. అప్పటికే రెస్టారెంట్ ఫుల్ అయిపోయింది. దీంతో నిర్వాహకులు వారిని లోపలికి అనుమతించలేదు. సీటు ఖాళీ అయ్యే దాకా ఆగాలని సూచించారు. దీంతో వారు వెయిట్ చేశారు. ఇది ఓ నెటిజన్ ట్విట్టర్ లో పెట్టడంతో వైరల్ అయింది. ‘‘ఓ మై గాడ్ జెసిండా అర్డెర్న్ రెస్టారెంట్ లోకి రావాలనుకున్నారు. కానీ ఫుల్ అవడంతో సిబ్బంది అనుమతించలేదు” అని నెటిజన్ ట్వీట్ చేశాడు. స్పందించిన గేఫోర్డ్ ‘‘దీనికి నేనే బాధ్యత వహించాలి. నేను సీటు రిజర్వ్ చేయలేదు. సీటు ఖాళీ అయిన తర్వాత ఇన్ఫమ్ చేశారు. గుడ్ సర్వీస్” అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి