యాప్స్ తో మస్త్ టైంపాస్..లాక్ డౌన్ తో పెరిగిన యూజర్స్,వ్యూవర్స్

యాప్స్ తో మస్త్ టైంపాస్..లాక్ డౌన్ తో పెరిగిన యూజర్స్,వ్యూవర్స్

హైదరాబాద్, వెలుగుమోస్ట్ హ్యాపెనింగ్​ సిటీ హైదరాబాద్​ ఇప్పుడెలాంటి ప్రోగ్రామ్స్ కూడా లేవు. లాక్​డౌన్​తో ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. జోష్​ఫుల్​ లైఫ్​కి అలవాటు పడ్డ సిటిజన్స్ మొబైల్ యాప్స్ తోనే ఎక్కువ టైమ్​ గడిపేస్తున్నారు. ఇంతకుముందు కంటే సోషల్​యాప్స్​యూజర్స్ సంఖ్య బాగా పెరిగింది. టిక్​టాక్​ను దేశవ్యాప్తంగా 500 మిలియన్ల మంది యూజ్​ చేస్తున్నారు. చిన్నాపెద్దా అంతా వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. తమ టాలెంట్​ని ప్రూవ్ చేసుకోడానికి, ఫన్ కోసం వీడియోస్​ చేస్తున్న వాళ్లు కోట్లల్లో ఉన్నారు.

ఫన్​ టు మోటివేషన్​

ఇంట్లో నలుగురికి స్మార్ట్ ఫోన్ ఉంటే ముగ్గురు కనీసం సోషల్ యాప్స్ యూజ్ చేస్తున్నారు. మూడేండ్ల పిల్లల నుంచి సీనియర్​ సిటిజన్స్​ వరకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఇన్​స్టాగ్రామ్ యూజ్​చేస్తున్న వాళ్లూ ప్రపంచవ్యాప్తంగా 1బిలియన్​ప్లస్​ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా అందులో తెలిసిపోతోంది. మోటివేషనల్ కోట్స్, వీడియోస్, ఫొటోలు పోస్ట్​ చేస్తున్నారు. సెల్ఫ్ వీడియోస్, కవర్ సాంగ్స్, ఫన్ వీడియోస్ ఎక్కువ.

కరోనాకి రిలేటెడ్​గా

టిక్ టాక్ యాప్​చాలామంది డైలీ లైఫ్ లో భాగమైంది. నార్మల్ ​డేస్​లోనే గంటల తరబడి వీడియోస్ చూస్తుంటారు. అలాంటి టిక్ టాకర్స్ కి లాక్ డౌన్ మంచి చాన్స్ గా మారింది. గతంలో డైలీ 2, 3 వీడియోస్​ చేసేవాళ్లు ఇప్పుడు 20–30 చేస్తున్నారు. లాక్ డౌన్, కరోనాకి రిలేటెడ్ గా మెసేజ్ లు, ఎంటర్​టైన్ చేసేందుకు ఫన్ వీడియోస్ పోస్ట్​ చేస్తున్నారు. క్రియేటివిటీని పెంచుకుంటున్నట్లు పలువురు చెప్తున్నారు.

ఎంటర్​టైన్ మెంట్ గానే యూజ్​ చెయ్యాలె

అంతా సోషల్​యాప్స్ కి అలవాటు పడుతున్నరు. వాటి ద్వారా తమ టాలెంట్  ప్రూవ్ చేసుకుంటున్నరు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ చూసి వదిలేస్తే మంచిది. కానీ వాటినే ఆలోచిస్తూ ఉంటే మాత్రం ప్రాబ్లమ్. వీడియోస్ చేయాలనుకునేటోళ్లు ఎలాంటి కంటెంట్ పెడుతున్నారో చూసుకోవాలి. ఎంతసేపు యూజ్ చేస్తున్నం అన్నది కూడా ఇంపార్టెంట్. యాప్స్​ను ఎంటర్​టైన్​మెంట్ పద్ధతిలోనే యూజ్ చేస్తే మంచిది.

– డా.హరిణి, సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్స్

8 గంటలు టిక్​టాక్​కే..

మాములు రోజుల్లో 2, 3 గంటలు టిక్ టాక్​తో స్పెండ్ చేసేటోణ్ని. ఇప్పుడు 8 గంటలు అదే పని. టైం దొరకడంతో వీడియోస్ క్వాలిటీ, కంటెంట్ బాగుండేలా చూసుకుంటున్న. కరోనా అవేర్నెస్ వీడియోస్ తో పాటు సాంగ్స్ పోస్ట్ చేస్తున్న. లాక్ డౌన్ మొదలయ్యాక వ్యూస్ పెరిగినయి.

– మెహబూబ్, టిక్ టాకర్