
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాయి అన్ని దేశాలు. ఇందులో భాగంగా చేపట్టిన లాక్ డౌన్ పై స్పందించారు ప్రంపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అదనమ్ గెబ్రియాసిస్. కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ చర్యలు సరిపోవన్నారు. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించారు. కరోనా బాధితులను గుర్తించి..వారిని ఐసోలేట్ చేయాలన్నారు. అందరికీ కరోనా పరీక్షలు చేసి, నిర్ధారణ అయిన వారికి ట్రీట్ మెంట్ అందించాలన్నారు. లాక్‌డౌన్ సమయంలోనే కరోనా వైరస్‌పై అటాక్ చేయాలని, ఈ అవకాశాన్ని అన్ని దేశాలు వాడుకోవాలన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత విస్తరింపచేయాలన్నారు. పూర్తి స్థాయిలో అనుమానిత కేసులను గుర్తించే వ్యవస్థను తయారు చేసుకోవాలని సూచించారు టెడ్రోస్.