
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు సేఫ్ డిపాజిట్ లాకర్ల సంస్థ ఆరమ్ హైదరాబాద్‌లో ప్రవేశించింది. 24 గంటలూ అందుబాటులో ఉండే టెక్ ఎనేబుల్డ్ బ్యాంకు లాకర్ సేవలను సత్వ మాగ్నస్, అపర్ణ సరోవర్ గ్రాండ్ గేటెడ్ కమ్యూనిటీల్లో అందిస్తోంది.
స్విస్ తరహా భద్రత, 24 గంటల్లో ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోగల సౌకర్యంతో ఖరీదైన ఇండ్లకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నామని ఆరమ్ ప్రకటించింది. 2026 నాటికి 50 ప్రీమియం కమ్యూనిటీల్లో 10వేల లాకర్లను అమర్చుతామని తెలిపింది.
ఇది వరకే బెంగళూరు, విశాఖపట్నంలో వేలాది లాకర్లను అమర్చామని ప్రకటించింది. ప్రతి లాకర్‌కు రూ. కోటి వరకు బీమా ఉంటుంది. విలువైన వస్తువులు తీసుకోవడానికి ప్రైవేటు లాంజ్‌కు వెళ్లవచ్చు. యాప్ ఆధారిత యాక్సెస్ ఉంటుందని ఆరమ్ సీఈఓ విజయ్ అరిశెట్టి తెలిపారు. ఈ ఏడాది చివరకు ఐదు వేల లాకర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లాకర్లకు అద్దె రూ.25 వేల వరకు ఉంటుందని చెప్పారు.