పార్లమెంట్లో నీట్ రగడ.. లోక్ సభ వాయిదా

పార్లమెంట్లో నీట్ రగడ.. లోక్ సభ వాయిదా

లోక్ సభలో నీట్ పేపర్ లీక్ పై గందరగోళం నెలకొంది.  నీట్ అక్రమాలపై పార్లమెంట్ లో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో స్పీకర్ ఓం బిర్లా..లోక్ సభను జూన్ 28 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

నీట్ అక్రమాలపై  రాజ్యసభ, లోక్ సభలో చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చకంటే ముందే NTAపై చర్చించాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నీట్ పేపర్  లీక్ పై సమగ్ర చర్చ  జరపాలని..  ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ . నీట్ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమని అన్నారు.  నీట్ పై రాజకీయం చేయొద్దని సూచించారు.  నీట్ పైచర్చకు ప్రధాని సహకరించాలని కోరారు.