లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ సమవేశాలు ప్రారంభం అయిన రోజే  రగడతో మొదలయ్యాయి. విపక్షాల ఆందోళనతో లోక్ సభ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్లకార్డులతో వెల్ లోకి వచ్చిన సభ్యులు నిరసనకు దిగారు. మరోవైపు లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు సైతం ఆందోళను దిగారు. వరిధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రైతుల సమస్యలపై చర్చించాలని  విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎంపిలను స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలు సభ సజావుగా జరగాలని కోరుకుంటున్నారన్నారు. దానికి తగ్గట్టుగా ఎంపీలు వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. దీంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు  లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.