బీజేపీ లోక్ సభ అభ్యర్థులు వీరే ఫస్ట్ లిస్ట్ లో 18 రాష్ట్రాల నుంచి 195 మంది

బీజేపీ లోక్ సభ అభ్యర్థులు వీరే  ఫస్ట్ లిస్ట్ లో 18 రాష్ట్రాల నుంచి 195 మంది

భారతీయ జనతా పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తిగా సిద్ధమైంది. ఈ రోజు 18 రాష్ట్రాల నుంచి 195 మందితో కూడిన  అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావడే బాబితాను విడుదల చేశారు. 57 మంది ఓబీసీలకు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. యువతకు 47 స్థానాలు కేటాయించినట్టు వినోద్ తావడే వెల్లడించారు. మొత్తం అభ్యర్థుల్లో 28 మంది మహిళలకు అవకాశమిచ్చారు. బెంగాల్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 24, గుజరాత్‌లో 15, రాజస్థాన్‌లో 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. యూపీలో అత్యధికంగా 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 

కేరళ 12 సీట్లు, తెలంగాణ 9 సీట్లు, అసోం 11, ఝార్ఖండ్ 11, ఛత్తీస్ గఢ్ 11, ఢిల్లీ 5 సీట్లు, జమ్మూ కశ్మీర్ 2, ఉత్తరాఖండ్, 2, అరుణాచల్ ప్రదేశ్, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, డామన్ డయ్యూ 1 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ  నుంచి 9మందిని ఖాయం చేయగా..  ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థులను  ఇంకా ప్రకటించలేదు.

వారణాసి నుంచి మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ బరిలో దితుతున్నారు. ఈ లిస్ట్‌లో మొత్తం 34 మంది ప్రస్తుత మంత్రులున్నారు. అరుణాచల్ లో కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీలో మనోజ్ తివారి, గుజరాత్‌లోని పోర బందర్ నుంచి మన్‌సుఖ్ మాండవియా, గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు.