UAPA బిల్లుకు లోక్ సభ ఆమోదం

UAPA బిల్లుకు లోక్ సభ ఆమోదం

అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ (UAPA) చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. బిల్లుపై చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా… అర్బన్ మావోయిజాన్ని ఉపేక్షించేది లేదన్నారు. దేశంలో ఎందరో సామాజిక సేవలో ఉన్నారని… వారెవరినీ పోలీసులు వేధించడంలేదన్నారు. అయితే అర్బన్ మావోయిస్టులపై మాత్రం తమకు సానుభూతి లేదన్నారు. ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా గుర్తించాలంటే… అనేక ప్రొవిజన్స్ ఉన్నాయని అమిత్ షా చెప్పారు. నాడు కాంగ్రెస్ చేసింది కరెక్ట్ అయితే ఇవాళ తాము చేస్తోంది కూడా కరెక్టేనన్నారు అమిత్ షా. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన తెలిపిన కాంగ్రెస్… సభ నుంచి వాకౌట్ చేసింది.

అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం సవరణ బిల్లును తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. బిల్లును వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకులుగా చిత్రిస్తున్నారని ఆరోపించారు తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా. జాతీయ భద్రతా అంశాలపై ప్రభుత్వంతో ఏకీభవించకపోతే… తాము దేశవ్యతిరేకులవుతామా..? అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం ట్రోల్ ఆర్మీలతో దాడి చేస్తోందని ఆమె విమర్శించారు. ఎలాంటి విచారణ జరపకుండా… ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ఎలా ప్రకటిస్తారని మహువా ప్రశ్నించారు. UAPA సవరణ బిల్లు… రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు.