బీజేపీకి 3.. అకాలీదళ్ కు 10 సీట్లు: పంజాబ్ లో పొత్తుపై అమిత్ షా

బీజేపీకి 3.. అకాలీదళ్ కు 10 సీట్లు: పంజాబ్ లో పొత్తుపై అమిత్ షా

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ ఒక్కో రాష్ట్రంలో పొత్తులు ఖరారు చేసుకుంటోంది. మిత్ర పక్షాలతో సీట్ల పంపకంపై కూడా ఒప్పందానికి వస్తోంది. ఇటీవలే తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. ఇవాళ తాజాగా పంజాబ్ లో తమ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తుపై చర్చించి ఒక ఒప్పందానికి వచ్చింది బీజేపీ. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. ఇందులో ఇరు పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

ఆ సమావేశం ముగిశాక సీట్ల పంపకంపై అమిత్ షా ట్వీట్ చేశారు. 13 ఎంపీ సీట్లు ఉన్న పంజాబ్ లో 3 చోట్లలో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. 10 సీట్లలో అకాలీదళ్ పోటీకి దిగుతుందన్నారు. 2014 ఎన్నికల్లోనూ రెండు పార్టీల మధ్య ఇదే సంఖ్యలో సీట్ల పంపకం జరిగింది.