Thalaivar 171: రజినీ కోసం గ్రే షేడ్స్ పాత్ర.. సరికొత్తగా ప్లాన్ చేస్తున్న లోకేష్

Thalaivar 171: రజినీ కోసం గ్రే షేడ్స్ పాత్ర.. సరికొత్తగా ప్లాన్ చేస్తున్న లోకేష్

లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదొక బ్రాండ్. తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అందుకే ఆయన సినిమాలపై చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు ఆడియన్స్. ఇటీవలే విజయ్ తలపతి తో ఆయన తీసిన లియో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఈ సినిమా ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ఇక ఈ సినిమా తరువాత లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో ఓ సినిమా చేస్తున్నాడు. తలైవార్171(Thalaivar 171) వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా గురించి, సినిమాలో రజినీకాంత్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు లోకేష్. ఇటీవల ఓ మీడియా మీట్ లో పాల్గొన్న లోకేష్ రజిని సినిమా గురించి మాట్లాడుతూ.. రజని సార్ సినిమా కోసం ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంది. సినిలో ఆయన పాత్ర చాల కొత్తగా ఉంటుంది. మొదటిసారి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో రజిని సార్ కనిపిస్తారు..  అంటూ  ఆసక్తికర కామెంట్స్ చేశారు లోకేష్. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

రజినీకాంత్ ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించలేదు. లోకేష్ సినిమా కోసం మొదటిసారి అలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు రజిని. దీంతో ఈసారి కూడా లోకేష్ ఎదో కొత్తగా ప్లాన్ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మరి రజినికాంత్ కెరీర్ లోనే సరికొత్తగా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.