కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్

కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్

లోక్ సభ ఆరో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఏడు రాష్ట్రాల్లో 59 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 14 , మధ్యప్రదేశ్‌లో 8, హరియాణాలో 10, ఝార్ఖండ్‌లో 4, బంగాల్‌లో 8, బిహార్‌లో 8, దిల్లీలో 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలోని 128 కేంద్రాల్లో రీ-పోలింగ్‌ జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగ్విజయ్ సింగ్, షీలా దీక్షిత్, అఖిలేష్ యాదవ్, గౌతమ్ గంభీర్ లాంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.