115 నియోజకవర్గాల్లో మూడో విడత పోలింగ్…

115 నియోజకవర్గాల్లో మూడో విడత పోలింగ్…

మొదటి, రెండో విడత ఎన్నికలను పూర్తి చేసిన ఈసీ.. మూడో విడత ఎన్నికల ఎర్పాట్లపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్‌ కు ఏర్పాట్లు చేస్తుంది. ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నాయి. లోక్‌ సభ ఎన్నికల్లో మూడోదశ పోలింగ్ మంగళవారం జరగనుంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 స్థానాల్లో ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

గుజరాత్‌ లోని మొత్తం 26 స్థానాలతో పాటు కేరళలో 20, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఉత్తరప్రదేశ్‌ లో 10, చత్తీస్‌ గఢ్‌ లో 7, ఒడిషాలో 6, బీహార్‌‌లో 5, అసోంలో 4, గోవాలో 2, దాద్రానగర్, హవేలీలో 1, డామన్ దీవిలో 1, జమ్ముకశ్మీర్‌లో 1, బెంగాల్‌లో 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 116 పార్లమెంట్ స్థానాలు కావడంతో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొదటి రెండు దశల కంటే మూడో దశలో అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరింత భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఈసీ.