ముగిసిన ప్రచారం.. ఎల్లుండే ఆఖరి దశ పోలింగ్

ముగిసిన ప్రచారం.. ఎల్లుండే ఆఖరి దశ పోలింగ్

లోక్ సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత ఎలక్షన్ ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఆదివారం పోలింగ్ తో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్ లో 8, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, బెంగాల్ లో 9 స్థానాలతో పాటు, చండీగఢ్ లోక్ సభకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయంతో బెంగాల్ లో నిన్న రాత్రే ప్రచారం ముగిసింది. మిగతా చోట్ల ఈ సాయంత్రం ప్రచారం ముగించారు.

చివరి విడత ఎన్నికల్లో బరిలో మోడీ

ఉత్తరప్రదేశ్ లో 13 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా… వారణాసి నుంచి ప్రధాని మోడీ బరిలో ఉన్నారు. అలే ఘాజీపూర్ నుంచి కేంద్రమంత్రి మనోజ్ సిన్హా పోటీ చేస్తున్నారు. మీర్జాపూర్ నుంచి మరో కేంద్రమంత్రి అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్ పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నియోజకవర్గమైన గోరఖ్ పూర్ నుంచి భోజ్ పురి నటుడు రవికిషన్ పోటీలో ఉన్నారు.

ఉద్రిక్తతలు, ఎన్నికల హింసతో దేశవ్యాప్తంగా వార్తలకెక్కింది బెంగాల్. చివరి విడతలో భాగంగా… డుమ్ డుమ్, బరాసత్, బసిర్హత్, జయనగర్, మథురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్ పూర్, దక్షిణ కోల్ కతా, ఉత్తర కోల్ కతా నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ 9 నియోజకవర్గాల్లోనూ 2014లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది.