అడవిశేష్కి జోడిగా లండ‌న్ బ్యూటీ..బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

అడవిశేష్కి జోడిగా లండ‌న్ బ్యూటీ..బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

క్షణం,మేజర్, హిట్ 2 మూవీస్ తో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్..ఇప్పుడు ‘గూఢచారి’ సీక్వెల్‌తో రాబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్తో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గ్లోబల్ ఫిల్మ్ గూఢచారి’ 2 లో గ్లోబల్ బ్యూటీ బనిత సందు నటిస్తున్నట్లు హీరో అడవిశేష్ ట్వీట్ చేశారు. ఆమె హిందీ, ఇంగ్లీష్ మూవీస్ లో నటించి..మంచి పేరు తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. కాగా త్వరలో బనిత సందు సెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. 

లండ‌న్‌లో పుట్టిపెరిగిన బ‌నితాసందు బాలీవుడ్ మూవీ అక్టోబ‌ర్‌తో హీరోయిన్‌గాఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌తో సౌత్ ఇండ‌స్ట్రీలో తొలి అడుగువేసింది. హాలీవుడ్‌లో ఎట‌ర్న‌ల్ బ్యూటీ, మ‌థ‌ర్ థెరిస్సా అండ్ మీ అనే సినిమాలు చేసింది.ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ప్రీ విజన్ వీడియో ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమా కోసం అడివి శేష్ సరికొత్తగా  మేకోవర్‌‌‌‌‌‌‌‌ అయినట్టు తెలుస్తోంది. ఇందులో శేష్‌‌‌‌‌‌‌‌ను ఇండియా నుండి ఆల్ఫ్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారిగా కనిపిస్తున్నట్టు సమాచారం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nykaa (@mynykaa)

ఈ చిత్రానికి హీరో అడవిశేష్ శేష్ కథను అందించగా..'మేజర్’ మూవీ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాను ఏకే ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.