ఢిల్లీలో ఎల్లో అలర్ట్: బారులు తీరిన జనం

ఢిల్లీలో ఎల్లో అలర్ట్: బారులు తీరిన జనం

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దేశ రాజధానిలో కరోనా రూల్స్ నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్ విధించిన కేజ్రీవాల్ సర్కారు.. మెట్రోతోపాటు బస్సులను 50 శాతం కెపాసిటీతో నడిపించాలని నిర్ణయించింది. మెట్రోల్లో నిల్చుని ప్రయాణించేందుకు కూడా అనుమతి నిరాకరించారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఆఫీసులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వందలాది సంఖ్యలో ప్రజలు బస్ స్టాండులు, మెట్రో స్టేషన్ల ఎదుర బారిన తీరారు. తక్కువ సీటింగ్ కెపాసిటీతో బస్సులు నడుస్తుండటంతో ప్రయాణికులకు వెయిటింగ్ టైమ్ పెరుగుతోంది. బస్సుల కోసం గంటల పాటు వేచి చూడాల్సి వస్తోందని కొందరు ప్రయాణికులు వాపోతున్నారు. బస్  స్టాండులు, మెట్రో స్టేషన్ల ఎదుట ప్రజలు బారులు తీరిన వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

మరిన్ని వార్తల కోసం: 

పార్లమెంట్లో కొట్టుకున్న ఎంపీలు

హైనా హల్ చల్.. మూడు దూడలు మృతి

చావనైనా చస్తాం.. భూమి ఇవ్వం