భద్రాచలం సీతారామ స్వామికి సార్వభౌమ వాహనంపై రాములోరి సందడి

భద్రాచలం సీతారామ స్వామికి సార్వభౌమ వాహనంపై రాములోరి సందడి

భద్రాచలం, వెలుగు : శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సీతారామస్వామికి సార్వభౌమ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి హారతులతో స్వాగతం పలికారు.

తాతగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలందుకున్నారు. ఉదయం యాగశాలలో ప్రత్యేక హోమాలతోపాటు పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు రద్దీగా మారాయి.