లారీ, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు మృతి... నల్గొండ జిల్లా కొండభీమనపల్లి వద్ద ప్రమాదం

లారీ, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు మృతి... నల్గొండ జిల్లా కొండభీమనపల్లి వద్ద ప్రమాదం

దేవరకొండ, వెలుగు: లారీ, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా కొండభీమనపల్లి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. సీఐ వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా చారగొండ మండలానికి చెందిన కొట్ర శివ (29), మరో మహిళ కలిసి బైక్‌‌‌‌పై చారకొండ నుంచి దేవరకొండకు వస్తున్నారు. కొండభీమనపల్లి వద్దకు రాగానే దేవరకొండ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న లారీ బైక్‌‌‌‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో శివతో పాటు మహిళ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ వెంకట్‌‌‌‌రెడ్డి, ఎస్సై నారాయణరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు శివ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మహిళ వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.