మెరిసే కురుల కోసం 5 పానీయాలు

మెరిసే కురుల కోసం 5 పానీయాలు

స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లెమ్ జుట్టు రాలడం. సాధారణంగా జుట్టు ఆరోగ్యం మన జన్యువులపై ఆధారపడి ఉంటుంది. కానీ సరైన సంరక్షణ లేకపోవడం కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుంది. జుట్టును కాపాడుకునేందు నూనె, షాంపూ, కండీషనర్లు వాడినా.. అవన్నీ రసాయనాలతో తయారు కావడంతో శాశ్వత పరిష్కారాన్ని చూపవు. మరి జుట్టు రాలకుండా ఉండేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి..?ఎలాంటి ఆహారం తినాలన్న విషయాలపై కన్సల్టెంట్, పోషకాహార నిపుణుడు రూపాలీ దత్తా కీలక సూచనలు చేశారు. దాంతో పాటు జుట్టు పెరుగుదలకు అవసరమైన చిట్కాలతో పాటు 5 రకా ఆరోగ్య పానీయాలను సూచించారు.

పాలకూర రసం: బచ్చలి కూర లేదా పాలకూరలోని ఇనుము, బయోటిన్ సమ్మేళనాలు వెంట్రుకల కుదుళ్లతో సహా కణ జాలాలకు ఆక్సిజన్ సరఫరాను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. బచ్చలికూరలో ఉండే ఫెర్రిటిన్ అనే మరొక మిశ్రమం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. 

దోసకాయ రసం: దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది, అంతేకాకుండా పోషకాలు సెబమ్‌ను ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది. 

ఆమ్లా జ్యూస్ : ఉసిరి ఒక సూపర్ ఫుడ్. ఆరోగ్యానికి ఎంతో మంచి మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ సి జుట్టు డ్యామేజ్‌ కావడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది. 

క్యారెట్ జ్యూస్: క్యారెట్ లో విటమిన్ ఏ, ఈ, బీతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు బలహీనం కావడాన్ని తగ్గిస్తుంది.

అలోవెరా జ్యూస్: పెరట్లో విరివిగా పెరిగే కలబంద జుట్టుతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇందులోని విటమిన్ ఏ, సి, ఇ.. కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దీని ద్వారా జుట్టుకు పోషకాలు సమపాళ్లలో అందుతాయి. ఫలితంగా బలమైన, మెరిసే జుట్టునిస్తుంది.