
ఈ ఏడాది నోబెల్ సాహిత్య అవార్డు అమెరికా రచయిత లూయిస్ గ్లూక్‌ను వరించింది. తన రచనల్లో అద్భుతమైన కవితా నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శించినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. అమెరికాలోని యేల్ వర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా చేస్తున్న ఆమె ఇప్పటి వరకు 12 కవితా సంపుటాలు రాశారు. చిన్నతనం నుంచి ఫ్యామిలీ లైఫ్ వరకు ఆమె అనేక రచనలు చేశారు. పేరెంట్స్, సోదరులతో సన్నిహిత సంబంధాలు.. ఆమె కవితా కథనంలో సెంట్రల్ థీమ్‌గా ఉన్నాయి. 2006లో ఆమె అవెర్నో అనే సంకలనం రాశారు. అనేక ప్రాచీనకాలం నాటి అంశాలపై ఆ రచనల్లో తన అభిప్రాయాలను ఆమె వినిపించారు. 2014లో ఫేయిత్‌ఫుల్, వర్చువస్ నైట్ అన్న శీర్షికలతో సంకలనం రిలీజ్ చేశారు. గతంలో గ్లూక్ అనేక అవార్డులను గెలుచుకున్నారు. 1993లో పులిట్జర్ ప్రైజ్‌ను కైవసం చేసుకున్నారామె. 2014లో నేషనల్ బుక్ అవార్డును గెలుచుకున్నారు.