ప్రేమ గుడ్డిదే.. కానీ రియాక్షన్ ఉంటది!

ప్రేమ గుడ్డిదే.. కానీ రియాక్షన్ ఉంటది!

బెంగళూరు: ‘‘ప్రేమ గుడ్డిది.. తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్ల ప్రేమ, ఆప్యాయత కంటే, సొసైటీ కంటే ఎంతో శక్తిమంతమైన ఆయుధంకూడా” అని కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న వ్యక్తితో ఉండేందుకు యువతికి అనుమతి ఇచ్చింది. అయితే ‘‘రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఉంటా యని పిల్లలు తెలుసుకోవాలి. నువ్వు నీ తల్లిదండ్రులకు ఇప్పుడు చేసిందే.. రేపు నీ పిల్లలు నీకు చేయొచ్చు” అంటూ ఆ అమ్మాయిని హెచ్చరించింది. టీఎల్‌‌ నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కామెంట్లు చేసింది. ఇంజనీరింగ్​ చదువుతున్న తన కూతురు నిసర్గను నిఖిల్​ బలవంతంగా తీసుకెళ్లాడని పిటిషన్‌‌లో నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం విచారణకు నిఖిల్​, నిసర్గలు హాజరయ్యారు. మే 13న పెండ్లి చేసుకున్నామని, తాను ఇష్టపూర్వకంగానే నిఖిల్ వెంట వెళ్లానని నిసర్గ చెప్పింది. తన భర్తతోనే ఉంటానని, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడం తనకు ఇష్టం లేదని తెలిపింది.