లవ్‌‌‌‌‌‌‌‌ మీ మూవీ ఏప్రిల్ 25న విడుదల

లవ్‌‌‌‌‌‌‌‌ మీ మూవీ ఏప్రిల్ 25న విడుదల

ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్‌‌‌‌‌‌‌‌ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్.  దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమేజింగ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 25న ఈ  చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. 

ఇదొక హారర్ థ్రిల్లర్.  ఓ కుర్రాడు  దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది  లాంటి  డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రూపొందిస్తున్నారు.  ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని మేకర్స్ చెప్పారు.