రోడ్డెక్కిన ప్రేమ జంట వివాదం

 రోడ్డెక్కిన ప్రేమ జంట వివాదం

కరీంనగర్: అజయ్, అఖిల అనే ఓ ప్రేమ జంట వివాదం రోడ్డెక్కింది. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన అజయ్.. అదే గ్రామానికి చెందిన అఖిల మధ్య చాలా రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు తెలియకుండా ఈ జంట పారిపోయి పెళ్లి చేసుకొని.. రెండు నెలలు హైదరాబాద్ లో కాపురం ఉన్నారు. అయితే అంతలోనే ఇరువురి మధ్య విభేదాలు రావడంతో భర్త (ప్రియుడు) తిరిగి భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. దీంతో విషయం తెలిసిన గ్రామస్తులు, అమ్మాయి బంధువులు ప్రేమికుని తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి.. రాత్రి అంబేద్కర్ చౌరస్తాలో సుమారు రెండు గంటలు పాటు 300 మందితో రాస్తారోకో, ధర్నా చేశారు. ఈ క్రమంలో ఎస్సై మామిడాల తిరుపతి ఇరువర్గాలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీస్ కౌన్సిలింగ్ తో మనసు మార్చుకున భర్త.. భార్యను కాపురానికి తీసుకెళ్లినందుకు ఒప్పుకున్నాడు. ఎస్సై చొరవతో అమ్మాయి బంధువులు ఆందోళన విరమించారు.