గంటలో రిజల్ట్‌ ఇచ్చే కిట్లు.. మరో నాలుగు వారాల్లో

గంటలో రిజల్ట్‌ ఇచ్చే కిట్లు.. మరో నాలుగు వారాల్లో
  • ఫెలుడా పేరుతో కిట్‌

న్యూఢిల్లీ: తక్కువ ఖర్చుతో.. కేవలం గంటలోనే కరోనా రిజల్ట్‌ ఇచ్చేలా మన దేశంలో రూపొందించిన కిట్లు మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ బెంగాళీ డైరెక్టర్‌‌ సత్యజిత్రే ఫేమస్‌ ఫిక్షన్‌ ‘ఫెలుడా’ పేరుతో దీన్ని రూపొందించారు. న్యూఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫికల్‌ అండ్‌ ఇండ్రస్ట్రియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోనామిక్స్‌ అండ్‌ ఇంటరాగేటివ్‌ బయాలజీ (సీఎస్‌ఐఆర్‌‌–ఐటీఐబీ)కి చెందిన సైంటిస్టులు డాక్టర్‌‌ దెబోజ్యోతి చక్రవర్తి, డాక్టర్‌‌ సౌవిక్‌ మైతాలు దీన్ని రూపొందించారు. వైరస్‌ను కనుకునేందుకు సీఆర్‌‌ఐఎస్‌పీఆర్‌‌ జెనీ – ఎడిటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించామని, అది జెనిటిక్‌ మెటీరియల్‌ను కనుగొంటుందని వారు చెప్పారు. “ సీఆర్‌‌ఐఎస్‌పీఆర్‌‌ బేస్డ్‌ ఫెలూడా సీఆర్‌‌ఐఎస్‌పీఆర్‌‌ బయాలజీ, పేపర్‌‌ స్ట్రిప్‌ కెమిస్ట్రీ ఆధారంగా పనిచేస్తుంది. పేషంట్‌ జెనిటిక్‌ మెటీరియల్‌లో బార్‌‌కోడ్‌ చేయడానికి సీఆర్‌‌ఐఎస్‌పీఆర్‌‌ వ్యవస్థ ఉపయోగపడుతుంది. సారస్‌ – సీవోవీ2 కాంప్లెక్స్‌ పేపర్‌‌ స్ట్రిప్‌కు అప్లై అవుతుంది. దీని ద్వారా కరోనా ఉందో లేదో తెలుస్తుంది” అని చక్రవర్తి చెప్పారు. ఈ టెస్ట్‌ ద్వారా రిజల్ట్‌ వచ్చేందుకు గంట సమయం పడుతుందని ఆయన అన్నారు. “ చాలా ల్యాబ్స్‌లో పీసీఆర్‌‌ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అది చాలా ఖర్చుతో కూడుకుంది, దానికి ల్యాబ్‌ సెటప్‌ అవసరం. కానీ మేం తయారు చేసినదానికి లెవల్‌ – 2, లెవల్‌ – 3 ల్యాబ్‌ టెస్టింగ్‌ అవసరం లేదు పాత్‌ ల్యాబ్‌లో చేస్తే సరిపోతుంది” అని సీఎస్‌ఐఆర్‌‌ – ఐటీఐబీ ఢిల్లీ డైరెక్టర్‌‌ అనురాగ్‌ అగర్వాల్‌ అన్నారు.