రాష్ట్రంలో రాబోయే 4 రోజుల్లో తెలికపాటి వర్షాలు

రాష్ట్రంలో రాబోయే 4 రోజుల్లో తెలికపాటి వర్షాలు

దీపావళి వెళ్లి వారమే అయినా చలి తీవ్రత బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకి పెరుగుతోంది. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 54 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈసారి అక్టోబర్ మూడో వారం నుంచే చలి వణికిస్తోంది.  మరోవైపు రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. 

ఏటా నవంబర్ రెండో వారంలో చలితీవ్రత పెరుగుతుంది. కానీ ఈ ఏడాడి అక్టోబర్ మూడో వారం నుంచే చలి క్రమంగా పెగరటం మొదలవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. శరీరం డ్రై గా మారటం...పగలటం స్టార్ట్ అయ్యింది. రాజేంద్రనగర్ లో అత్యల్పంగా 13.8 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వికారాబాద్ లో జిల్లా బంట్వారంలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏటా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాల్లోనూ 13.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నా... పగలు మాత్రం 30 డిగ్రీలు వరకూ నమోదవుతున్నాయి.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం 13 నుంచి 20 డిగ్రీల రాత్రి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఓవర్ ఆల్ గా 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతున్నంత మాత్రన శీతాకాలం మొదలయినట్లు కాదని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న శీతల గాలులతో.. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవతున్నట్లు తెలిపారు. గాలుల ప్రభావం తగ్గితే ఉష్ణోగ్రతలు మళ్లీ సాధారణ స్ధాయికి చేరుకుంటాయన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలో రాబోయే నాలుగైదు రోజుల్లో తెలికపాటి నుంచి అతితెలికపాటి వర్షాలు ముఖ్యంగా కురిసే చాన్స్ ఉందన్నారు. మిగితా అన్ని ప్రాంతాల్లో పొడివాతావరణం ఉంటుందని చెబుతున్నారు. 

తెల్లవారుజామున చలి తీవ్రత నార్మల్ గా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అతితక్కువగా 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నట్టు చెప్పారు. మిగితా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నట్లు తెలిపారు. రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత సాధారణంతో పోలిస్తే.. 2 డిగ్రీలు అటు ఇటుగా ఉండే చాన్స్ ఉందన్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 28 నుంచి  31డిగ్రీల వరకు నమోదవుతున్నాయన్నారు. రెండు రోజుల తర్వాత మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు అధికారులు.

అక్టోబర్ నెలలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 54 ఏళ్ళ కనిష్టానికి పడిపోయాయి. 1968 అక్టోబర్ 26న హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రత 11.7 డిగ్రీలుగా నమోదైంది.. మళ్ళీ ఇన్నేళ్ళకు ఈ నెల 24న 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. 22న 19.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా... ఆ తర్వాత రోజుకి 16.3 డిగ్రీలకు పడిపోయింది. దీపావళి రోజున అది మరింత 14.9 డిగ్రీలుగా నమోదైంది. అక్టోబర్ లోనే చలి ఇలా ఉంటే... నవంబర్ లో చలి తీవ్రత ఇంకా పెరుగుతుందని జనం ఆందోళన పడుతున్నారు.