
దేశంలో వంట గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది. సబ్సిడీ LPG సిలిండర్ పై మెట్రో నగరాల్లో రూ.37 వరకు ధర పెరిగింది. మూడు నెలల పాటు వరుసగా తగ్గుతూ వచ్చిన గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి(సోమవారం,జూన్-1) నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో LPG ధర పెరగడంతో సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తెలిపింది.
పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ 636కు పెరిగింది. ఇక ఢిల్లీలో నిన్నటి వరకు రూ.581.50 ఉండగా, ఇప్పుడు రూ.593కి చేరింది. కోల్‌కతాలో గ్యాస్ సిలెండర్ ధర రూ.584.50 నుంచి రూ.616కి పెరిగింది . ముంబైలో 579 రూపాయలనుంచి 590.50కి చేరింది. చెన్నైలో రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరింది.