భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర

భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర

సబ్సిడీ లేని ఎల్‌పిజి (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) సిలెండర్ల ధర భారీగా పెరిగింది.  ఒక్కసారే 144.50 రూపాయిలు పెంచింది కేంద్ర ప్రభుత్వం.  వంట గ్యాస్ ధర పెంచడం ఇది వరుసగా ఆరవ సారి. ఢిల్లీ, ముంబై నగరంలో ఒక్కో సిలిండర్‌కు రూ.144.5  పెంచిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఫిబ్రవరి 12 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.  2014 జనవరి తరువాత ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తం పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన ధరతో ఎల్‌పిజి సిలిండర్‌ ధర 858.50 రూపాయిలకు చేరింది.

 పెరిగిన నాన్-సబ్సిడీ ఎల్పిజీ 14.2 కిలోల సిలిండర్ ధర నగరాల వారీగా ఇలా ఉంది

                 ప్రస్తుత ధర       పాత ధర

ఢిల్లీ            858.50          714.00

కోల్‌కతా       896.00          747.00

ముంబై        829.50          684.50

చెన్నై          881.00          734.00