కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

కమర్షియల్ గ్యాస్  సిలిండర్ ధర తగ్గింపు

కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. కమర్షియల్ వంట గ్యాస్ ధరలు స్వల్పంగా తగ్గాయి.  19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది. ఇదే సమయంలో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

ఏప్రిల్ 1న 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 తగ్గింది.మే నెలలో  19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్‌ల ధరపై రూ.19 తగ్గించాయి. మళ్లీ జులైలో రూ.31 తగ్గించింది.