
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: రక్షణ రంగాలను మరింత పటిష్టం చేయడానికి, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి కొత్త టెక్నాలజీపై దృష్టిపెడుతున్నామని మిలిటరీ కాలేజ్ఆఫ్ ఎలక్ర్టానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్న్షే అన్నారు. గురువారం గీతం యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందుకోసం వివిధ ఇంజినీరింగ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ వింగ్ కమాండర్ శివాంచల్ఆస్థానా మాట్లాడుతూ సాంకేతిక ఆవిష్కరణలతో భారత నావికదళం పటిష్టంగా ఉందన్నారు. కార్యక్రమంలో వీసీ డీఎస్ రావు, కోర్ ఇంజినీరింగ్ డీన్ రామశాస్త్రి, కెప్టెన్ శర్మ, ప్రొఫెసర్ శ్రీనివాస్, వర్క్‌షాప్ కన్వీనర్ ప్రీతి అంబరీశ్ సర్వేకర్, కో కన్వీనర్ జయప్రకాశ్శ్రీవాస్తవ, ఎండీ అక్తర్‌ఖాన్, డాక్టర్ అనీత, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.